![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
బేత్లేహేము పురమునందు – Bethelehemu puramunandhu
బేత్లేహేము పురమునందు – Bethelehemu puramunandhu
పల్లవి:-
బేత్లేహేము పురమునందు
పశువుల పాకయందు
పుట్టినాడు ఏసు దేవుడు
మన అందరికి రక్షకుడు ||2||
ఆహ్లాదకరమైన సందడి.. సందడి
సంతోషకరమైన సంబరం.. సంబరం ||2||
1) కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను
పాప భారము మొయువాడై మనకొరకై ఉదయించెను||2||
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా ||2|Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి
||బేత్లేహేము||
2) ఆకాశంలో చుక్కను చూసి జ్ఞానులు శాస్త్రలు
బంగారమును సాంబ్రాణియు బోలములను అర్పించిరి||2||
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా ||2||
Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి
||బేత్లేహేము||
3) దూతలేళ్ళరు చాటి చెప్పిరి ప్రవచనాలు నెరవేరునట్లు
తన ప్రజలను పాపము నుండి ఇమ్మానుయేలు రక్షించెను||2||
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా ||2|Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి
||బేత్లేహేము||