![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ఆత్మ పూర్ణుడా సర్వ శక్తిమంతుడా – Athma Poornudaa sarva sakthimantuda
ఆత్మ పూర్ణుడా సర్వ శక్తిమంతుడా – Athma Poornudaa sarva sakthimantuda
ఆత్మ పూర్ణుడా సర్వ శక్తిమంతుడా
ఆరాధింతును నా పూర్ణ బలముతో
నిన్ను ఆరాధింతును నా పూర్ణ మనస్సుతో
నీవు చేసిన మేళ్లకు ఏమిచ్చి నీ ఋణము
నేనెలా తీర్చగలను నా యేసయ్య
నమస్కరించి స్తోత్రాలు పాడి ఆరాదింతును
ప్రభావ వంతుడా నిన్ను ఆరాధింతును
సౌoదర్య వంతుడా
1.సింహాల గుహ అయినా చెరసాల గది అయినా బడబాగ్ని గుండములో పడద్రోయబడినా
ఆగలేదు ఆ స్తుతి గీతo కోల్పోలేదు
నీ పై విశ్వాసo
ఎంతో ధైర్యము మరెంతో సాహసమిచ్చెనే
ఆరాధన నీకు స్తోత్రార్పణ ఆరాధన నీకు స్తోత్రార్పణ
2. దెయ్యాలు వణికెను రోగాలు తొలగెను
ప్రభావము నీ నుండి బయలు దేరుచుండగా
స్వస్థత కలిగెను నిను తాకినంతనే
దుఃఖ దినములు సమాప్త మాయెను
ఎంతో బలమును మరెంతో శక్తినిచ్చెను
నీ నామము సజీవ నామము
నీ నామము
ఘనమైన నామము
3. ఘోర పాపమైనను వ్యసనాలలో ఉన్నను
అపరాధ భావమే వెంటాడుచున్నను
విడుదల కలుగును
నీదు సిలువ చెంత
నెమ్మది కలుగును
మనస్సు నిండా
ఎంతో శుద్ధిని మరెంతో జయమునిచ్చును
నీ రక్తము అమూల్య రక్తము
నీ రక్తము ప్రశస్త రక్తము
- బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu
- నీ నామములోనే పొందెదను రక్షణ – Nee Naamamulone Pondedhanu Rakshana
- అన్నిటికన్నా మించిన ప్రేమే – Annitikanna Minchina preme
- కంటిపాపలా కాచినావయ్యా – Kantipaapalaa Kaachinaavayyaa
- సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu
- జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
- రక్షకుండుదయించినాడట – Rakshakundu Udayinchinadu
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
- Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం
- ఊహకు మించిన కార్యములు చేయువాడా – Oohaku minchina karyamula