![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
రాజు మహారాజు – Bolo Maha Raju Ki Jai
రాజు మహారాజు – Bolo Maha Raju Ki Jai
ఆ……………
రాజు మహారాజు -రాజు యుదుల రాజు (2)
రాజు పుట్టాడని -మహా రాజు పుట్టాడనీ…
వెలుగై వచ్చాడనీ -మార్గం చూపిస్తాడనీ (2)
ఆశ్చర్యకరుడని -ఆలోచనకర్తయని -నిత్యుడుగు తండ్రియని -సమాధానకర్తయని -బలవంతుడైనా దేవుడని -ఆయనే అధిపతియని -చాటిచెప్పేదం.. హ్మ్ హ్మ్మ్…..
Chorous:-
భోలో-భోలో-భోలో మహారాజుకి జై
ఈ లోక రక్షకుడైనా -యేసు రాజుకి జై (2)
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
1. ఓ అక్కా…. ఓ తమ్ముడా…..
ఓ అక్క..ఓ తమ్ముడా
విన్నావా ఈ వార్తనూ …..(2)
క్రీస్తుయేసూ మన అందరికోసం-రక్షకునిగా ఇల జన్మించాడనీ
ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడనీ -మరిఎన్నోవిజయాలు నీకు ఇస్తాడని
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)(భోలో)
2. ఓ తరమా….ప్రియజనమా…
ఓ తరమా.. ఓ ప్రియజనమా
విన్నావా ఈ వార్తనూ… (2)
సర్వమానవాళికి నిజదైవమూ-శ్రీ యేసయ్య ఒక్కడేననీ
మార్గం సత్యం జీవం తానై -అందరికీ నీరీక్షణ ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ.. ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ (2)
(భలో )
3. ఓ అవ్వా…. ఓ తాతా…..
ఓ అవ్వ..ఓ తాత విన్నావా
ఈ వార్తనూ….. (2)
మన పాపభారమంతా-సిలువలో మోసినాడనీ
పాప క్రయధనము చెల్లించీ-నిత్యజీవమును ఇచ్చాడనీ
వింటున్నావా ఈ శుభవార్తనూ… ఇస్తున్నావా నీ హృదయంలో చోటునూ..
(2)(భోలో)