దివిలో దేవుని సంకల్పం – Dhivilo Devuni Sankalpam
దివిలో దేవుని సంకల్పం – Dhivilo Devuni Sankalpam
భువిపై మానవ జననం – దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం – మనిషికై సృష్టి నిర్మాణం
“2”
సృష్టిలో మనిషే ప్రత్యేకం – దేవుని పోలికా స్వరూపం
తల్లి గర్భమే ప్రారంభం – తన చేతులతో నిర్మాణం
సర్వ సృష్టంతయు మనిషి దాసోహం
మన తనువంతయు దైవ మహిమార్ధం “2”
ఇదే నిత్య సత్యం – మనిషి జన్మకు పరమార్ధం “2”
మనిషి జన్మకు పరమార్ధం!
భువిపై మానవ జననం – దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం – మనిషికై సృష్టి నిర్మాణం
01) జగమంతా లేనపుడే మనిషే తన మనసంతా
జనమంతా లేనపుడే వారికై దైవ తపనంతా
“2”
విశ్వమంతయు సృజించినపుడు
అంతరిక్షము కలిగినప్పుడు
దూత జయ ధ్వనులు చేసినప్పుడు
భూమికి పునాది వేసినపుడు
దేవుని మనసులో ఆనందం – మనిషి సృష్టి ఇక ఆరంభం
మనిషి రూపము ప్రత్యక్షం – మనిషే దేవుని సర్వస్వం
భువిపై మానవ జననం – దివిలో దేవుని సంకల్పం
దేవుని ప్రేమకు ప్రతిరూపం – మనిషికై సృష్టి నిర్మాణం
02) తన పొలికలో మనిషిని చేసి మురిసాడు తండ్రి మనసంతా
మనిషిని సృష్టిలో రాజుగా చేసి చూపాడు దైవ ప్రేమంతా
“2”
విశ్వమంతయు నీకిచ్చినప్పుడు
జీవులన్నియు లోబడినప్పుడు
జ్ఞాన ఘనతలు నీలో చూచినప్పుడు
వారసునిగా నిన్ను ఎంచినప్పుడు
దేవుని మనసులో ఆనందం- మనిషి జీవితం ఆరంభం
మనిషి కోసమే సర్వస్వం – మనిషే దేవుని సంకల్పం
“2”
3) పరిశుద్ధునిగా నిన్ను చూడాలని తలచాడు తండ్రి మనసంతా
నిర్దోషినిగా నిలబెట్టాలని చూపాడు దైవ కృపనంతా
“2”
విశ్వమంతయు లేనప్పుడు
సంకల్పమంతయు చేసినప్పుడు
తల్లి గర్భములో నీవు పడనప్పుడు
అవయవములు రూపించనప్పుడు
దేవుని మనసులో ఆరాటం – మనిషి జీవితం తనకోసం
మనిషి కోసమే తన స్వాస్థ్యం – క్రీస్తు ద్వారానే అది సాధ్యం