ఈ సాయంకాలమున – Ee Sayamkalamuna
ఈ సాయంకాలమున – Ee Sayamkalamuna
Andhra Kraistava Keerthana song lyrics
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము=
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు – ||మీ||
1. చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో –
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ||
2. దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము =
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ||
3. నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున =
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ||
4. జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ||