Gundello Nindina – గుండెల్లో నిండిన
గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా
అ.ప. : యేసయ్యా యేసయ్యా
చేస్తున్నా స్తోత్రాలాపన
నీకే ఆరాధన
1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు జరిగాయి నీవలన
నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్నా
అన్నివేళలయందున
2. నా ఊహకందని మహోపకారాలు కలిగాయి నీవలన
ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నా
నీ ఆవరణమందున