![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
హల్లేలూయా పాడెదా ప్రభు నిన్ను – Hallelujah Padeda Prabhu Ninnu
హల్లేలూయా పాడెదా ప్రభు నిన్ను – Hallelujah Padeda Prabhu Ninnu
పల్లవి :- హల్లేలూయా పాడెదా… ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నివేళల యందునా – నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
చరణం 1:- వాగ్దానములనిచ్చి – నెరవేర్చు వాడవు నీవే
నమ్మకమైన దేవా – నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
చరణం 2 :- ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్
చరణం 3 :- కష్టములన్నింటినీ – ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును – నా జీవంపు దాతవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్