![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
క్షేమముగా ఉన్నానయ్యా – Kshemamuga Unanaya
క్షేమముగా ఉన్నానయ్యా – Kshemamuga Unanaya
క్షేమముగా ఉన్నానయ్యా నీ దయవలనా
నెమ్మదినే పొందానయ్యా వాగ్దానముల వలనా
నీ నిర్ణయాలతో ప్రతికీడు నుండి తప్పించి నా యేసయ్యా ॥2॥
మహిమతో నిండిన ప్రాణేశ్వర నా ఆనంద గానాలు నీకేనయ్యా
జీవితమంతా నీకంకితం ఎదలో నిండిన నాయేసయ్యా ॥క్షేమముగా॥
1. సామర్థ్యమును మించి ఊహల్లో ఊరేగి రేపాను నీకోపమును నిండుగా
విశాల హృదయముతో ప్రక్షాళనము చేసి ఆత్మతో నింపావు సర్వేశ్వర
వ్యవసాయ మందలి పైరువలే కాలువ యోరన వృక్షములా ॥2॥
వాడక నీ కొరకు ఫలియించెద. ॥మహిమతో॥
2. నా సొంత తలంపు నీ చిత్తమేనని హృదయమును ఒప్పించి జయమొందినా ఆకాశమంతటి ఆటంకములను పంపించి గెలిచావుజ్ఞానేశ్వర॥2॥
కురిసేటి ఆ మంచు బిందువులా మేఘాలయందలి వర్షములా ॥2॥
నీ నోటి మాటకు తలదించెదా ॥మహిమతో॥
3. నెలవైనవారు నా సాక్ష్యమును తమ శైలిలో చెరిపి ప్రచురించినా
సంపూర్ణ దీవెన నా సొత్తు చేసి అహమంత అణిచావు పరమేశ్వర ॥2॥ సీయోనులోని పర్వతమై భువియందు దాగిన బంగారమై
స్థిరముగ నీ కొరకు నే మెరిసెద ॥క్షేమముగా॥
Kshemamuga Unanaya Good Friday Songs lyrics In Telugu