![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
లలిత వనిత విద్యుల్లత కెరటం – Lalita vanita vidyullata keratam
లలిత వనిత విద్యుల్లత కెరటం – Lalita vanita vidyullata keratam
లలిత వనిత విద్యుల్లత కెరటం
విదితం సఫలం విధేయత కిరీటం
యూదయ కన్యక పవిత్రాత్మ స్థావరం
ఆనందం అంత శుభవార్త కైవసం
CH: మరియా, ఓ అనుచరణి – వేడుక మీ అనుసరణ
ఆదరువు నీ విన్నపము – పర్వము మీ చిర స్మరణ
స్వీకరించే వాక్కును ధరియించే గర్భమును
ప్రభుని ఘనతకు భాణీయయ్యె మరియ
ఆలపించే ఆదినుండి -యావే ఆలనాపాలనా
ఏసుకే తల్లియై వినమ్రతే అలంకృతియై
CH: మరియా, ఓ అనుచరణి – వేడుక మీ అనుసరణ
ఆదరువు నీ విన్నపము – పర్వము మీ చిర స్మరణ
కుమారుని జాడలో సిలువ నీడలో
శిష్యుల పరిచర్యలో ఆత్మ అలంబనలో
పరవశించే ఈధన్య అరుదెంచె ప్రభు పీఠం
దివిభువి రాజ్ఞిగా – విజయమేరీగా