నా మనసా భయపడకు – Na Manasa Bayapadaku
నా మనసా భయపడకు తోడెవరులేరని చెదరకుమా బెదరకుమా…
నమ్మిన వారే నిన్ను విడిచినను చెదరకుమా బెదరకుమా…నా మనసా…
కష్టాలలోని యోబు ని చూడే మనసా ,
అన్నియు కోల్పోయిన విశ్వాసం కోల్పోలేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున కోల్పోయిన దానికి రెండింతలుగా ఇచ్చేను…
భయమెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా…
అనాధగా ఉన్న యోసేపును చూడు
అందరూ విడిచిన విశ్వాసం కోల్పో లేదు అది చూసిన తండ్రి దేవుడు ఒక రోజున యోసేపును దీవెనగా మార్చేనే మనసా
దిగులెందుకే ఓ నా పిచ్చి మనసా నీ సమయం సమీపించి ఉన్నదే మనసా…నా మనసా.