నా మదినిండ నీవే యేసయ్య – Naa madhininda neeve yesayya
నా మదినిండ నీవే యేసయ్య – Naa madhininda neeve yesayya
ఊహించలేను ప్రభు నీవు లేని క్షణమైనా..
నేను ఆశించలేను ప్రభు నీవు లేనిదేదైనా.
మనసంత నీవే యేసయ్య..
నా మదినిండ నీవేనయ్య. ||2||
||ఊహించలేను||
కాచితివీ నన్ను-ఇంతకాలం
పిలిచితివీ నను-నీ నిత్య కృపలో ||2||
దీన స్థితిలో-నేనుండగా
దీరుడవై వచ్చి-దీవించినావు ||2||
కలలోనైనా-మరువగలనా
నీ నామ స్మరణ-విడువగలనా ||2||
మోసితివీ నీవు-నాపాపభారం
చూపితివీ నను-నీ జీవ మార్గం ||2||
కష్ట కాలన-నేనుండగా
కాపరివై వచ్చి-కాపాడినవు ||2||
నీ తోడు లేక-ఉండగలనా
నీ ప్రేమ లేక-బ్రతుకగలనా ||2||
||ఊహించలేను||