![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నాతో కూడా రాని ఈ మట్టి దేహం – Natho Kuda Rani
నాతో కూడా రాని ఈ మట్టి దేహం – Natho Kuda Rani
నాతో కూడా రాని ఈ మట్టి దేహం
నేను ప్రేమిస్తున్నానా నీకు దూరంగున్ననా
నాతో నీవు ఒకరోజు రావు నాలో నీవు ఒకరోజు ఉండవు
చివరకు నాలో మిగిలే ఆత్మను
నే ప్రతిదినము దుఃఖపరుస్తున్నానా
నాతో నీవు ఒకరోజు రావు నాలో నీవు ఒకరోజు ఉండవు
నా ప్రాణమా నా ప్రాణమా యోచించుము ప్రాణమా
నా ప్రాణమా నా ప్రాణమా ఒకసారి యోచించుమా
1. ఆరోగ్యము నాలో ఉన్నంతవరకు
నా దేహముకెంతో విలువుంది ఇలలో
రోగము నన్నావరించిన వేళలో
రారెవ్వరు నా దేహపు దరిలో
ఏమాయెను ఈ లోకపు ప్రేమ
నాగుండెను బ్రద్దలు చేసిన
ఏమాయెను ఐశ్వర్య ప్రేమ
ఒంటరి చేసిన క్షణమున || నా ప్రాణమా||
2. దిన దినము ఆత్మకు విలువనిస్తూ
ప్రాణాత్మకు విధేయత చూపుతూ
ప్రతి క్షణము ప్రభుని ప్రార్ధిస్తూ ఉంటూ
పశ్చాత్తాప మనసు కలిగి ఉంటూ
ఏ ఉగ్రత దినము అయినను
నీ క్షేమము పరమున ఉండును
పరమందాసీనుడా నీ కౌగిలిలో నన్ను దాచుమా || నా ప్రాణమా||