![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీ చేతులతో మలచి నీరూపమే – Nee Chethulatho Malachi
నీ చేతులతో మలచి నీరూపమే – Nee Chethulatho Malachi
నీ చేతులతో మలచి నీరూపమే నాకిచ్చిన పరమ కుమ్మరి
అపురూపమైన ప్రేమను చూపి నీ ఊపిరి పోసిన పరమ తండ్రివి – (2)
దినమెల్ల నీ కీర్తి నా నోటనుంచి ఆరాదింతును
నా కన్న తండ్రివి నీవేనని నా పూర్ణ మనస్సుతో ప్రేమింతును- (2)
1. పిండముగా రూపింపక మునుపే నన్నెరిగిన దేవుడవు
నీమహిమలో నన్ను చూడాలని ప్రాణము ఇచ్చిన ప్రేమ రూపివి – (2)
నాపాపములన్ని తెల్లగ కడిగి – (2)
నీ రక్షణ భాగ్యముతో అలంకరించావు – (2)
2. ఉన్నతమైన నీ పిలుపునకు కలుగు బహుమానము పొందుటకు
నీ మహోపకారములు నేను మరువక నిలచి ఉన్నాను నీ ప్రేమలో – (2)
నీరాకడకై ఎదురు చూచుచూ – (2)
నీగుడారామందె నే దాగి ఉందును – (2)
దినమెల్ల నీ కీర్తి నా నోటనుంచి ఆరాదింతును
నా కన్న తండ్రివి నీవేనని నా పూర్ణ మనస్సుతో ప్రేమింతును- (2)