![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీ జీవితం నిన్నటిదే – Nee Jivitham Ninnatidhe
నీ జీవితం నిన్నటిదే – Nee Jivitham Ninnatidhe
పల్లవి :
నీ జీవితం నిన్నటిదే రేపు ఏమి జరుగునో తెలియదులే
నేడు ఉన్నంతకాలం దేహము దేవునికి అర్పించి నీవు జీవించాలి
బ్రతికి ఉన్నంతకాలం సమాజ సేవలో దేవుని పనులలో జీవించాలి
చరణం 1:
అది నాదని ఇది నాదని అన్నీనావని అంటావు
కొనినది ఏది నీ వెంట రాదని
మరణంతో తెలుసుకుంటావు
దాచిన ధనముకై దౌర్జన్యం చేసి
కూర్చుని సొమ్ముకై మోసాలు ఎన్నో చేసి
ధనవంతుడనని నీవు ఒప్పొంగిపోవుచున్నావు
బంధాలు ఎన్నిటినో తెంచి వేసుకున్నావు
సాధించినది లేక తరలిపోవుచున్నావు
తనువును చాలించి వెళ్ళిపోవుచున్నావు
మాయ మాయ మనిషి మాయ మాయ
చరణం 2:
పుట్టిన మనిషికి మరణం ఉందని
ప్రతి మనిషి తెలుసుకున్నాడు
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని
తెలియకనే జీవిస్తున్నాడు
దేహము విడిచిన క్షణముననే నీవు
పరిశుద్ధులతో కలవాలని దేవుడు
క్రీస్తును మన కొరకు సిలువకప్పగించెను
పాపనికై ప్రభువు ప్రాణాలు విడిచెను
పరిశుద్ధుల మధ్య పాట పాడుచున్నను
తల్లిదండ్రుల ముందర తరలిపోవాలని
మాయ మాయ మనిషి మాయ మాయ