![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీ ప్రేమ గీతము – Nee prema geethamu
నీ ప్రేమ గీతము – Nee prema geethamu
పల్లవి: నీ ప్రేమ గీతమూ నే పాడుకుందును
నీ గొప్ప కార్యముల్ నే వివరించెదను
ఇహ పరములయందు నీవే నా దేవుడవు
ఆదియంతమూ లేని అమరుడైన నా ప్రభు
అష॥ నీలా నను ప్రేమించేదవరూ
నీలా నను క్షమియించేదవరూ
నీలా నను ఇల వెదకేదెవరూ
నీలా నను సరి చేసేదెవరూ
నీ ప్రేమ గొప్పదయా, నీ ప్రేమ మారదయా
నీ ప్రేమను చూపించి, నీ ప్రేమలో నిలిపితివి
1. పాపినని తెలిసి కూడా నన్ను ప్రేమించావు
నా పాపమంత మోసి నాకై బలియైనావు ||
నాకు బదులు మరణించి నిత్యజీవమిచ్చావు
నన్ను నీవు విడుంకుండా నాకు తోడైయున్నావు ॥2॥ ॥నీలా॥
2. మంచి సమరయుడవై నన్ను ఆదరించినావు.
నీతి మార్గమందు నడిపి నా కాపరిగ మారావు
నాకై గాయములు పొంది నన్ను స్వస్థపరచావు.
నీదు ఆత్మతో నను నింపి నాకు తండ్రివైనావు ॥2॥ ॥నీలా॥
- ఇదే ఆశ నాలో నా యేసయ్య – Idhe aasa naalo
- బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu
- నీ నామములోనే పొందెదను రక్షణ – Nee Naamamulone Pondedhanu Rakshana
- అన్నిటికన్నా మించిన ప్రేమే – Annitikanna Minchina preme
- కంటిపాపలా కాచినావయ్యా – Kantipaapalaa Kaachinaavayyaa
- సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu
- జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
- రక్షకుండుదయించినాడట – Rakshakundu Udayinchinadu
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
- Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం