![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
Nee Subha Charanam – నీ శుభ చరణమే
Nee Subha Charanam – నీ శుభ చరణమే
నీశుభ చరణమే
నా పాపములకు
విడుదల నిచ్చెనని
నీవాక్యమే నా శ్రమలన్నిటిలో
నెమ్మదినిచ్చెనని…
కొనియాడి, కీర్తింతు క్రీస్తేసునాధ
నీ శుభనామమును…
ఊబిలో చిక్కిన పాపిని నేను
ఉనికిలో నేను జీవచ్ఛవమును
ఊపిరినిచ్చిన నిజదైవమా..
ఊహకందదు నీ ప్రేమా..
స్వస్థత లేక సంకట పడితిని…
సంవత్సరములుగ నలిగిపోతిని..
వస్త్రపు చెంగు తాకినంతనే…
శాంతి,సమాధానమొసగితివి
దాహముకిమ్మని నాకడ నిలిచి..
దాచిన నాపాప బ్రతుకును తెలిపి
జీవజల వర ప్రధాతవై…
జీవితమునే మార్చితివి