![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీ ప్రేమ శాశ్వతం దేవా – Nithyuda Sthotramu
నీ ప్రేమ శాశ్వతం దేవా – Nithyuda Sthotramu
నీ ప్రేమ శాశ్వతం దేవా.. నీ కృప నిరతముండునయ్యా
నీ కీర్తి శాశ్వతం దేవా.. నీ శాసనాలు సత్యమయ్యా..
కాలాలు మారిపోయినా, తరాలు తరిగిపోయినా
నీ ప్రేమ తరుగునన్న మాట లేదయా..
కన్నవాళ్లు విడిచిపెట్టినా, ఒంటరిగ ఒదిలివేలిసినా
వీడిపోని, ఒదిలిపోని ప్రేమ నీదయా..
నిత్యుడా.. స్తోత్రము.. స్తోత్రము.. నీకు స్తోత్రము
నా నీతిమంతుడా.. స్తోత్రమూ.. ||2|| స్తోత్రము!
మాయదారి మాయల లోకం.. మారనివ్వనంటున్న వైనం
మత్తులోనా మునిపోయి మోసపోయా నేనింతకాలం
చేయకుండా ఏ చిన్ని నేరం.. మోయలేని ఆ శిలువ భారం
మోసుకుంటూ వెళ్ళినావా ఘోరమైన ఈ పాపి కోసం
నీచమైన నా చేతలకై మేకులా నీ చేతులకు
హేయమైన నా అడుగులకై సీలలా నీ పాదములకు
చాలయ్యా నీదు ప్రేమ నాకు ఈ జన్మకు..
నిత్యుడా.. స్తోత్రము.. స్తోత్రము.. నీకు స్తోత్రము
నా నీతిమంతుడా.. స్తోత్రమూ.. ||2|| స్తోత్రము!
మోసకారి నాకున్న దేహం.. మూసివేసే నా మనోనేత్రం
శరీరాన్ని సాకుకుంటూ త్రోవతప్పిపోయే నా జీవం
పావనము నీ పుణ్యకాయం.. పస్తులుందా ఈ పాపికోసం
తలచుకుంటే నీదు త్యాగం చేయగలనా నెనింకో నేరం
చెడ్డవైన నా తలంపులకై.. గ్రుచ్చినారా ముళ్ళు నీ తలకు
నాదు ఆత్మ రక్షణ కొరకై.. కొరడాలా నీ వీపునకు
మారదా లోకము మొత్తం నీ రక్త ధారలకు
నిత్యుడా.. స్తోత్రము.. స్తోత్రము.. నీకు స్తోత్రము
నా నీతిమంతుడా.. స్తోత్రమూ.. ||2|| స్తోత్రము!