ప్రార్ధించుమా ఓ సోదరా – Prardhinchuma o sodara
ప్రార్ధించుమా ఓ సోదరా – Prardhinchuma o sodara
పల్లవి: ప్రార్ధించుమా ప్రార్థించుమా ఓ సోదరా (సోదరి) నీ బ్రతుకంతా మార్చు వాడు యేసయ్య రా ॥2॥ విశ్వాసముతో దేవుని నీవు ఆశ్రయించుమా శక్తికిమించిన కార్యములు నీవు చూడుమా ॥ప్రార్ధించు॥
1. గొర్రెలు కాచే దావీదు స్తుతించి ప్రార్థించెను ఇశ్రాయేలు ఏలే రాజుగా నియమించిన స్తుతించి ప్రార్థించి ఆరాధించుము నీ స్థితిగతులన్నీ మార్చు వాడు నిన్ను చేరను//2//
2. దేవాలయంలో హన్నా దేవునికి మొర పెట్టాను వేదనతో కన్నీళ్ళతో దేవుని ప్రార్థించెను అవమానం దుఃఖము దేవుడు తీసెను నిందకు ప్రతిగా ఘనతను నీకు ఇచ్చును//2//
3. చెరసాలలో పౌలుశీలలు పాడుతూ ప్రార్ధించెను పాపపు సంకెళ్లు తెంచెదను పరిశుద్ధాత్ముడే వచ్చును కష్టములో బాధలో దేవుని స్తుతించుము కీడు వెనకాల మేలు దాచిన యేసుని ఘనపరచుము॥ 2॥ ప్రార్ధించు॥