ప్రతీవేకువలో నీ దర్శనం – Prathiveekuvalo nee darshanam
ప్రతీవేకువలో నీ దర్శనం – Prathiveekuvalo nee darshanam
ప్రతీవేకువలో నీ దర్శనం – నా బ్రతుకంతయు బహుధన్యము ||2||
నా హృదయ సింహసనాసీనుడా – నా ఆరాధనకు యోగ్యుడా ||2||
ప్రజ్వలించునాలో మహిమాసీనుడా
నా సహాయమై – స్నేహమైనవాడా||2||
1. సర్వము కలిగినను శ్రమలేదురైనను
మోషేవలె నాకు విజయమునే నేర్పు.
ఏ దేశమైనను నా దేశమైనను
దానియేలువలె నాకు నిలకడనే నేర్పు. || 2 ||
ఆత్మభిషేకముతో నింపుము
నీ సేవకై నను వాడుము. || 2 || ( ప్రజ్వలించు)
2. అధికారమైనను అంధకారమైనను
పరిశుద్ధతే నాకు యోసేపువలె నేర్పు.
ఐశ్వర్యమైనను దారిద్ర్యమైనను
కృతజ్ఞతనేనాకు యోబువలె నేర్పు. || 2 ||
మహిమ వస్త్రముతో నను కప్పుము
ఆత్మ శక్తితో బలపరచుము. || 2 || ( ప్రజ్వలించు)