Raaraje Digivachenu – ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
Raaraje Digivachenu – ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
Verse:
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
జన్మించె ఇలలో దైవపుత్రునిగా – ఇమ్మానుయేలు దేవుడు
Pre Chorus:
నిత్య మహిమను చూపించను – నీతి సూర్యుడై ఉదయించెను
నిత్య జీవమే ఇచ్చుటకు – రారాజే దిగివచ్చెను
రారాజే దిగివచ్చెను నా రాజే దిగివచ్చెను – మహారాజే దిగివచ్చెను యేసు రాజే దిగివచ్చెను
Chorus:
హెూసన్న హల్లెలూయా – హెూసన్న హల్లెలూయా
చరణం:
1. నా చీకటి తొలగింపను తన మహిమతో దిగివచ్చెను
నా ఆత్మను వెలిగింపను – వాక్యముగా వసియించెను
2. నా దోషములను బాపను – తన ప్రాణమే అర్పించెను
నా శిక్షను భరించను – దౌర్జన్యము తాను పొందెను
3. తన రాజ్యము నన్ను చేర్చను – మార్గముగా తానే మారెను
నన్ను క్రమముగ నడిపింపను – తన ఆత్మతో ముద్రించెను