Sahiyinchinavaarini – సహియించినవారిని
Sahiyinchinavaarini – సహియించినవారిని
సహియించిన వారిని దన్యులనుచున్నాము
సహనాన్ని కలిగి ఉన్నామా?
ఓర్పు గల వారినీ వీరులంటుంటున్నాము
ఓర్చుకునే స్థితిలో ఉన్నామా?
ప్రియ నేస్తం… మన నాథుడు మన ప్రభు యేసు
మనకోసం… సహియించెను శ్రమలు అనేకం
చూపించే… మాదిరి మనకోసం
నేర్పించే… సహనమనే పాఠం. | సహియించిన |
రాహేలును ప్రేమించి భార్య స్థితిని తనకే ఇచ్చి
ప్రేమంతా తనకే పంచెను యాకోబు.
అందగత్తె కాదని తలచి మోము చూడ ఇష్టత విడిచి
కష్టపెట్టే లేయా మనసును ఆరోజు..
హృదయములో… వేదన ఎంతో ఉన్నా..
సహనంతో… భరియించెను బాధలు ఎన్నో
తన సహనం.. దరిశించెను పరమున దైవం
ఫలములతో దీవించిన చరితను చదివాం
అది ఎరిగిన క్రైస్తవులం.. మనమే స్థితిలో ఉన్నాం..
సహియిస్తే పరమును చూస్తాం | సహియించిన |
ఆనందం కోల్పోయి ఆస్తులన్ని పోగొట్టుకొని
వేదనతో పడిఉన్నాడు ఆ యోబు
ఆరోగ్యం చెడిపోయి కన్నబిడ్డలను కోల్పోయి
దిక్కు తోచక పడివున్నాడు ఆ రోజు
అనలేదే దేవునిని ఒక మాటైనా..
నిలబడెనే.. సహనముతో ఏదేమైనా
మన బ్రతుకే బాధల వలయంలా ఉన్నా
సహియిస్తే.. దన్యులుగా మిగిలెదమన్నా..
విశ్వాసం కలిగుంటే.. వాగ్దానం నిలుచుంది
శ్రమల మాటున సుఖముంది. | సహియించిన |