శ్రమ దినాలా – Srama Dinala
శ్రమ దినాలా – Srama Dinala
శ్రమ దినాలా?…. క్రైస్తవుని దినాలన్నీ శ్రమలా ?
ఉపవాస దినాలా ?.. క్రైస్తవుని బ్రతుకంతా ఊపవాసాలా ?
ఏమి చెబుతున్నదీ…బైబిలు…
ఎలా భక్తి చేయాలనంటుంది… బైబిలు…
తెలుసుకోవాలనే తన పిల్లలు…
వ్రాయించి ఇచ్చాడు దేవుడే బైబిలు…
ఇవి ప్రభువు వచ్చేటి ఘడియలు
బాలేవు ప్రస్తుతపు దినములు
ఆచారాలే….అలవాటైనా…అవి వాక్యంతో సరిపోనపుడు
వాటినొదలాలి…ఎదగాలి…ప్రపంచ క్రైస్తవులు
శ్రమదినాలా
1. సుమారు ముప్పై మూడున్నర ఏళ్లు – తన సువార్త ప్రయాణము…
చేయాలన్నది దేవుని సంకల్పము – అది కాదు సులభతరము
మనుషుల అపరాధాల పరిహారమై – బలి కావాలి తనదేహము
మలినమేదైన తనలో ఏర్పడితే – మన విడుదల అసాధ్యము
శరీరాన్ని పని కొరకు – నలువది దినముల పాటు
నలుగగొట్టి…సిద్ధపరచి…పనిని మొదలు పెట్టాడు
ఇది ఎరుగని క్రైస్తవులు – మానవ కల్పితములను
ఆ దేవుని ఉపదేశాలుగా పాటిస్తున్నారు
ఇది వక్యానికే… విరుద్ధము…మారాలి క్రైస్తవ్యమూ….
శ్రమదినాలా
2. ప్రభుయేసు తదనంతరము అపోస్తలులు
పని చేశారు ప్రభుకోసము..
పునరుద్ధానానికి సాక్షం ప్రకటిస్తూ….వాళ్ళు చేశారు ఉపవాసము..
ఏడాదికో నలువది దినముల పాటు…చేయనేలేదు ఆ కార్యము
ప్రాణాలు పోయేటి తుది ఘడియల వరకు….
శ్రమ పడ్డారు ఘమనించుము
పూట భోజనాన్ని కాదు..నోట దుర్బాషలు మాను
నీతి కొరకు … నీదు బ్రతుకు …ఖర్చు చేయుటే ఉపవాసము
ఎదుట ఉన్న బీదలకు – ఆకలి తీర్చుట కొరకు
నీదు ధనము ఖర్చు పెడుతూ …పరిశుద్ధంగా బ్రతుకు
ఇది నీ దేవుడే …నిను కోరిన…నిజమైన ఉపవాసమూ
శ్రమదినాల