![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం – Sthothra Geethamulu
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం – Sthothra Geethamulu
Lyrics:
పల్లవి:
స్తోత్రగీతములు యెహోవాకు పాడెదం
సంగీత స్వరములతో గానము చేసెదం – 2
గళమెత్తి పాడెదం యేసు నామమును హెచ్చించెదం -2
స్తుతియాగము అర్పించేదం
సర్వోన్నతుని సన్నుతించేదం – 2
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ -2
చరణం: 1
వంకర మార్గమును – తిన్నగా చేసెను
పాడైన బ్రతుకులను సరిచేసి నిలిపేను 2
మన దీనస్థితిని మార్చివేసెను
మన దుఃఖమును తొలగించేను – 2
ప్రేమాస్వరూపుడు – దీర్ఘశాంతుడు -2
చరణం: 2
ఘనమైన కార్యములు – జరిగించియున్నాడు
ఏ కొదువ లేకుండా – నడిపించియున్నాడు -2
మనలను ఎంతో ప్రేమించెను
గొప్ప దీవెనలు కురిపించెను – 2
కరుణస్వరూపుడు – మహోపకారుడు -2
చరణం: 3
స్తుతులపై ఆసీనుడు – యెహోవా దేవుడు
లోక రక్షకుడు మన యేసు నాధుడు – 2
నిండు మనసుతో కొనియాడేదం
మన చేతులెత్తి పూజించేదం – 2
ఆత్మస్వరూపుడు – ఆరాధ్యనీయుడు – 2