విన్నారా ఓ వింత – Vinnara O Vintha
విన్నారా ఓ వింత – Vinnara O Vintha
పల్లవి :-
విన్నారా ఓ వింతా తన పిల్లలేనంటా
తనను మరిచారంట తన మాట వినరంట
తనకున్న బాధంతా చెప్పాడు ప్రకృతికంతా
పక్షులకు నవ్వు రాదే మృగములకు మాటలేదే
వృక్షములు మూగవేలే పురుగులు ఏలలేవే
ఈ జగతిలో తన పిల్లలే రారాజుగా ఎలాలని
రేయి పగలు కష్టపడుతూ చేసాడు సృష్టి అంతా
“విన్నారా ఓ వింతా తన పిల్లలేనంటా”
చరణం :-
ఈ సృష్టిలో ఉన్నదంతా సేవ చేసే దూతలంట
సకల జాతి జీవలుకంటే మనుషుడేమో శ్రేష్టుడంట
అందుకేగా సూర్యుడేమో టైము ప్రకారం వస్తాడంట
రాత్రి పగలు రెస్ట్ లేక గాలి పని చేస్తుందట
చెట్టు ఫలము మనిషికంట చెట్టుకేమో వేస్టు అంట
ఆవు పాలు మనిషికంట దానికేమో గడ్డి అంట
సృష్టి కంటే గొప్పగా చేసిన
తండ్రినే మరిచారటా…
“విన్నారా ఓ వింతా తన పిల్లలేనంటా”
చరణం :-
నేలపైన అలలకైనా దేవుడంటే భయం అంట ఘోషిస్తువున్న ఎన్నడైన దైవ మాటను మిరరంట
దైవ రూపాన్ని పిల్లలేమో పక్షి పురుగుగా మార్చిరంట హేహమైన పేర్లు పెడుతూ హేళనేమో చేసిరంట
ఎద్దు ఆవని మనిషి నంటే ఎందుకో కోపం అంట
పంది ఎలకని పేర్లు పెడితే నరునికేమో ఒళ్ళు మంట
న్యాయమేదో చెప్పమంటూ
ప్రకృతిని సాక్షిగా పెట్టేనంటా …
“విన్నారా ఓ వింతా తన పిల్లలేనంటా”