ఏ ఆశలు లేని నా హృదయములో – Ye Aashalu Leni
ఏ ఆశలు లేని నా హృదయములో – Ye Aashalu Leni
ఏ ఆశలు లేని నా హృదయములో ఆశలు కలిగించినావే
నిరాశలోవున్న నాకు నీవు నిరీక్షణ ఇచ్చినావే – 2
ఏమని చెప్పను నీ ప్రేమకు – 2
నలిగిన నన్ను మలినమైన నన్ను
చేరదీసినావు – ఆదరించినావు -2
1. పాపశాపములతో సాతాను సంకెళ్లతో
బంధింపబడిన నన్ను విడుదల చేసావు – 2
ఫలమే లేని నా బ్రతుకును
ఫలభరితమైనదిగా చేసావు – 2
నా రక్షణ నా నిరీక్షణ నీవే యేసయ్యా – 2
2. అందరిచేత నేను ద్వేషిoపబడితిని
గాయములొందితిని బాధింపబడితిని – 2
బలహీనమైన నా దేహమును
నీ ఆలయముగా చేసావు – 2
నా ఆశ్రయము నా దుర్గము నీవే యేసయ్యా – 2